టీడీపీలోకి చేరిన పలువురు నేతలు- కొత్త సంవత్సరంలో శుభ పరిణామం - Ayyana Patrudu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2024/640-480-20409207-thumbnail-16x9-ysrcp-leaders-joined-in-tdp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 1:15 PM IST
YSRCP Leaders Joined In TDP: మూడు నెలల్లో రాష్ట్రంలో మెరుగైన పాలన వస్తుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటికల్బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇన్నాళ్లు నిరాదరణకు గురైన ప్రాంతాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని నాతవరం మండలం మాధవనగరం, అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన కొంత మంది ముఖ్య నేతలు అయ్యన్న పాత్రుడు సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని అయ్యన్న కండువా కప్పిన పార్టీలోకి ఆహ్వానించారు.
TDP Political member Ayyana Patrudu: ఈ సందర్భంగా అయన్న మాట్లాడుతూ జరిగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అనేకమంది వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం శుభపరిణామం అన్నారు. ధర్మవరం మాజీ సర్పంచ్ దూసరి మహలక్ష్మి, మాధవ నగరానికి చెందిన దొడ్డా అప్పారావు, కోమర్తి సుబ్బారావు, జి. కె. గూడేనికి చెందిన బర్ల వరహాలబాబు తదితరులు అనుచరులతో కలిసి అయ్యన్న సమక్షంలో టీడీపీలో చేరారు.