తెలుగుదేశం పార్టీలోకి వలసలు - కిక్కిరిసిన ఎన్టీఆర్​ భవన్ - చంద్రబాబు సమక్షంలో చేరికలు - యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 1:10 PM IST

YSRCP leaders joined in TDP in Vijayawada : తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్దసంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో (TDP) చేరారు. నేడు ఎన్టీఆర్​ భవన్‌లో (NTR Bhavan) చంద్రబాబు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో  టీడీపీలో (TDP) చేరారు.  

YSRCP Members Joining In to Telugu Desam Party : వైసీపీ  (YSRCP) ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కూడా సైకిల్‌ ఎక్కారు. నెల్లూరు జిల్లా చేనేత నాయకుడు బూదాటి రామయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరికలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు (Chandrababu Naidu ) సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.