ఆయన తీరుతో పార్టీలో ఉండలేకపోతున్నా- అందుకే రాజీనామా చేస్తున్నా! - టీడీపీ వర్సెస్ వైసీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 10:34 PM IST
YSRCP leader Sivaprasad resigned: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నేత శివప్రసాద్ పీఏసీఎస్ డైరెక్టర్ పదవికి, టౌన్ కమిటీ సెక్రటరీ పదవితో పాటు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్ట పడినా తనకు పార్టీలో గౌరవం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్ రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రణయ్ రెడ్డి పార్టీ క్యాడర్ను గౌవవించడం లేదన్నారు. వార్డుకు సంబంధించిన విషయాలు చర్చించకుండా, ప్రతి విషయాన్ని ప్రణయ్ రెడ్డి డబ్బుతో ముడి పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రణయ్ రెడ్డి తీరుపై కార్యకర్తలు తీవ్ర అంతృప్తిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ బోర్డులో తీవ్రమైన అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై వార్డు సభ్యులు సైతం ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలుచేశారని గుర్తు చేశారు. ప్రణయ్ రెడ్డి అవినీతి చేసిన వారికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారని శివప్రసాద్ తన రాజీనామ లేఖలో ఆరోపించారు. తన పట్ల ప్రణయ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. అందువల్లే వైఎస్సార్సీపీకి, తన పీఏసీఎస్ డైరెక్టర్ పదవికి, టౌన్ కమిటీ సెక్రటరీ పదవికి, రాజీనామా చేసినట్లు మీడియా ద్వారా వెల్లడించారు.