ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్న వైసీపీ నాయకులు- ఏకంగా కార్యకర్త భూమినే కబ్జా - YCP leader land grab in Erraguntapalli
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 11:32 AM IST
YCP Leader Grabbed his Own Party Worker Land: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరు నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేతలు భూకబ్జాలు యధేచ్చగా చేస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు అది ఎవరిది, మన పార్టీనా లేక వేరే పార్టనా అనే బేధం లేకుండా కబ్జాలు చేస్తున్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన భూమిని ఆక్రమించాడంటూ కార్యకర్త దస్తగిరి ఆరోపించారు. తాడిపత్రి నియోజకవర్గం ఎర్రగుంటపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దస్తగిరికి పెద్ద పడమల వద్ద ఒకటిన్నర ఎకరా పొలం ఉందని చెప్పారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ పొలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైలా నరసింహయ్య పార్టీలు మారుతూ సొంత పార్టీ కార్యకర్తలను సైతం ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి తన కుటుంబం వైఎస్సార్సీపీకి సన్నిహితంగా ఉన్నామని ఇవాళ జిల్లా అధ్యక్షుడు పదవి పేరుతో భూములను పైలా నరసింహయ్యకు కబ్జా చేస్తున్నాడని దస్తగిరి ఆరోపించారు. జిల్లా అధికారులు పరిశీలించి తన భూమి తనకు వచ్చేలా న్యాయం చేయాలని దస్తగిరి కోరారు.