చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతపై వైసీపీ అనుచరుల దాడి - వైసీపీ ఎమ్మెల్యే పరామర్శ - వైసీపీ నేతల దాడిని ఖండించిన లోకేశ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:00 PM IST

YSRCP Followers Attacked on TDP Leader Muniratnam: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భీమవరం గ్రామంలో తెలుగుదేశం నేత మునిరత్నం నాయుడిపై వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. కుటుంబ సమస్య పరిష్కరించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా.. చంద్రగిరి గ్రామ పొలిమేరల్లో వైసీపీ నేతలు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మునిరత్నంను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన మునిరత్నంను చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే వైసీపీ.. టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. మద్యం, గంజాయి మత్తులోనే చెవిరెడ్డి అనుచరులు మునిరత్నంపై దాడి చేశారని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.