ETV Bharat / state

చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ - సంతోషంలో నారా కుటుంబం - CHANDRA BABU GRAND SON WORLD RECORD

వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌ నుంచి నారా దేవాన్ష్‌కు ధ్రువపత్రం - వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

CHANDRA BABU GRAND SON WORLD RECORD
CHANDRA BABU GRAND SON WORLD RECORD (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 2 minutes ago

CHANDRA BABU GRAND SON WORLD RECORD: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

"చెక్‌మేట్ మారథాన్" పేరుతో ప్రపంచ రికార్డు : వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ "చెక్‌మేట్ మారథాన్" పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజీళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్‌ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు.

నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి భారీ విరాళం

అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సృజనాత్మకంగా నేర్చుకునే డైనమిక్ విద్యార్థి: దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ తెలిపారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేశ్ వెల్లడించారు. "దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి" అని ఆయన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్‌ సొంతమని తెలిపారు.

చంద్రబాబు ప్రశంసలు: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్​గా 175 పజిల్స్​లో ప్రపంచ రికార్డ్‌ను దేవాన్ష్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేశ్, బ్రాహ్మణిలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న గ్రాండ్ మాస్టర్ దేవాన్ష్ ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. చదరంగంలో 175 పజిల్స్‌ను పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్‌మేట్​తో ప్రపంచ రికార్డును నెలకొల్పిన దేవాన్ష్​కు అభినందనలు తెలిపారు.

కృషి, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకమన్న ఆయన, ఈ విజయం కోసం నెలలు తరబడి దేవాన్ష్ కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అధికారిక ధృవీకరణను స్వీకరించినందుకు తాము సంతోషిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ఘనత కోసం దేవాన్ష్ అంకితభావం, పట్టుదలతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రుల అభినందనలు: చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేశ్​ కుమారుడు దేవాన్ష్​ను మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడు, కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ రెడ్డి, పార్ధ సారధి, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలు అభినందనలు తెలిపారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్​కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృవీకరణ అందుకున్న దేవాన్ష్‌ మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్​కు మహిళ విజ్ఞప్తి

రాష్ట్రానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh saved Virendra Kumar

Last Updated : 2 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.