Conclusion Of Bhavani Deeksha In Vijayawada: భవానీ దీక్షా విరమణలు రెండవ రోజు ఉదయం నుంచి భక్తులు హోమగుండముల వద్ద నేతి కొబ్బరికాయలు,పూజా ద్రవ్యములు సమర్పించుకున్నారు. భవాణీ దీక్షా విరమణల సందర్భంగా యాగశాల దగ్గర శత చండీ యాగం జరుగుతోంది. డిసెంబర్ 21 నుండి 25 వరకు 5 రోజుల పాటు యాగం జరగనుందని అధికారులు తెలిపారు. భవాణీ దీక్షా విరమణల పురస్కరించుకొని ఈ ఐదు రోజులలో భక్తులందరికీ దర్శనం ఉచితమని, అంతరాలయం, దర్శన టిక్కెట్లు ఉండవని, ఆర్జిత సేవలు నిలుపుదల చేసిన్నట్లు ఈవో తెలిపారు. అన్ని లైన్ లు ఉచితమని, ఉదయం 3 నుండి రాత్రి 11 గం. ల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చునని తెలిపారు.
Home Minister Anita Visited Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మవారిని హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో కె. ఎస్. రామారావు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం చిత్రపటాలను అందజేశారు. హోం మంత్రితో పాటు పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు సైతం ఉన్నారు. భవానీ దీక్షల సందర్బంగా భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను గురించి మంత్రికి పోలీస్ కమీషనర్ , ఆలయ ఈవోలు వివరించారు. అమ్మవారి దర్శనం నకు విచ్చేసిన పలువురు భవానీ భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల పై భక్తుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
Telangana Minister Sitakka Visited Kanaka Durga Temple: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం,చిత్రపటాలను అందజేశారు.