ETV Bharat / state

'అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - లోపలికి చొరబడి పూలకుండీలు ధ్వంసం' - PROTEST IN ALLU ARJUNS HOUSE

అల్లు అర్జున్ ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన - రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ నినాదాలు - ఇంటిపై రాళ్లు విసిరిన ఓయూ జేఏసీ నాయకులు - స్పందించిన అల్లు అరవింద్‌

OU JAC groups students protest in front of Allu Arjuns house
OU JAC groups students protest in front of Allu Arjuns house (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2024, 6:04 PM IST

Updated : Dec 22, 2024, 8:59 PM IST

OU JAC Students Protest in Front of Allu Arjuns House: విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని నటుడు అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్‌ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.

విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్ధుల ఆందోళన సమయంలో అల్లు అర్జున్‌ ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆందోళన చేస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు పీఎస్‌కు తరలించారు. అనంతరం అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఘటనపై అల్లు అల్లు అరవింద్‌: అల్లు అర్జున్ నివాసంపై విద్యార్ధి సంఘాల రాళ్ల దాడిపై ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు." మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు. అందరూ సంయమనం పాటించాలి. అదే మంచిది. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు " అని తెలిపారు. అలాగే ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోని వ్యక్తుల నుంచి సమాచారం సేకరించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద బయటి వ్యక్తులను నిల్చోకుండా పోలీసులు పంపిస్తున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై రాజకీయ ప్రకంపనలు

సంధ్య థియేటర్‌ ఘటనపై విడయో విడుదల : ఈ ఘటనకు ముందు పుష్ప-2 సినిమా విడుదల కారణంగా డిసెంబరు 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సీసీ ఫుటేజ్‌తో కూడిన వీడియోను విడుదల చేశారు. ఏ నిమిషంలో ఏం జరిగిందనే దృశ్యాలను పొందుపరుస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానం ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయ పరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్ బిహేవ్‌ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదే అని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు.

అలాంటి వారికి దూరంగా ఉండండి: అభిమానులకు అల్లు అర్జున్‌ విజ్ఞప్తి

అల్లు అర్జున్ హీరో కావొచ్చు కానీ పౌరుడే కదా - సంధ్య థియోటర్ ఘటనపై స్పందించిన డీజీపీ

Last Updated : Dec 22, 2024, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.