YSRCP Councillor Husband Harassing Woman Volunteer: మహిళా వాలంటీర్​ను వేధిస్తున్న వైసీపీ మహిళా నేత భర్త.. నిలదీసినందుకు కుంటుంబంపై దాడి - husband of the councilor molested the volunteer

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2023, 10:21 AM IST

YSRCP Councillor Husband Harassing Woman Volunteer in Vuyyuru : కృష్ణా జిల్లాలో ఉయ్యూరులోని రెండో వార్డు వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్‌ సుభద్ర భర్త సురేష్.. పట్టణంలో ఓ మహిళా వాలంటీర్‌ను మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు అర్ధరాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1వ సచివాలయం ఆడ్మిన్‌తో తనకు చిన్న వివాదం వచ్చిందని, ఆ వివాదంలో తనకి అనుకూలంగా ఉంటానని చెప్పిన సురేష్.. దీన్ని ఆదునుగా తీసుకుని తనని మానసికంగా వేధించడం మెుదలు పెట్టాడని మహిళా వాలంటీర్ వాపోయింది. ఆ వేధింపులు భరించలేక ఆమె తన భర్తకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ విషయాన్ని అడగటానికి వెళ్లిన కుటుంబ సభ్యులపై కౌన్సిలర్‌ సుభద్ర దూషించి, దాడి చేయించారని (YCP Councillor Attack on Woman Volunteer Family) తెలిపారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని భావించిన బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో వైసీపీ పెద్దలు రాజీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సదరు మహిళా వాలంటీర్‌ వాపోయింది. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.