Attack on Woman With Knife : మహిళపై హత్యాయత్నం.. దారికాచి.. స్కూటీని ఢీకొట్టి కత్తులతో దాడి - AP News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 12:50 PM IST
Youths Attack on Woman With Knife in Guntur : గుంటూరు ఎల్ఐసీ కాలనీలో వివాహితపై నలుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. పూర్తి వివరాలివీ.. మధు కుమారి అనే మహిళ తమ కుటుంబంతో గుంటూరులో జీవనం సాగిస్తోంది. గురువారం ఉదయం తన కుమారుడిని పాఠశాలలో వదిలి స్కూటీ మీద తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆమెను వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టారు. కింద పడిపోగానే మరో ఇద్దరు యువకులు.. మొత్తం నలుగురు యువకులు కత్తులతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మధు కుమారి గట్టిగా కేకలు వేయడంతో యువకులు బైకులపై అక్కడ నుంచి పారిపోయారు. అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. వైద్యులు మధు కుమారికి చికిత్స అందిస్తున్నారు. గతంలో తన భర్తతో విభేదాలు ఉండేవని, ఇప్పుడు కలిసే ఉంటున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. దాడి చేసిన వారెవరో తనకి తెలియదని మధు కుమారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.