Young Man Tried to Commit Suicide in Dharmavaram: కట్టెల టవర్‌పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్ - Sri Sathya Sai District local News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 12, 2023, 9:49 PM IST
Young Man Tried to Commit Suicide in Dharmavaram: ఓ యువకుడు కట్టెల టవర్‌పై నుంచి దూకి.. ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనంగా మారింది. దూకకుండా అతన్ని రక్షించాలని గ్రామస్థులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అసలు ఏం జరిగిదంటే.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీస్ స్టేషన్ ఎదుట రాజు అనే యువకుడు.. కటౌట్ కోసం నిర్మాణంలో ఉన్న కట్టెల టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ అతనికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అక్కడున్న స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇటుకల బట్టి కార్మికుడిగా పని చేస్తున్న రాజు మద్యానికి బానిసై.. యజమానితో గొడవపడి ఈ ఘటనకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు, స్థానికులు యువకుడిని కిందికి రావాలని కోరినా.. పట్టించుకోకుండా కిందకు దూకేశాడని పేర్కొన్నారు. సమయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అతను కరెంట్ తీగలు, చెట్టు కొమ్మలపై పడినా ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.