మహిళపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తున్న వైసీపీ తీరు సరికాదు - పోతిన మహేష్ - సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 11:58 AM IST

YCP Social Media Operators abuses janasena party women : వైసీపీ సోషల్ మీడియా ఆపరేటర్లు.. సామాజిక మాధ్యమంల్లో జనసేన మహిళను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని జనసేనపార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్​ఛార్జ్ పోతిని మహేష్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం... సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న సింగంశెట్టి సాయి నాగదుర్గపై అసభ్య పోస్టులు పెడుతూ.. కుటుంబ సభ్యుల్ని బెదిరిడం సరికాదన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఆపరేటర్లులైనా.. సమీరా, కిరణ్, వర్దన్, చల్లా వెంకట్... అసభ్య పోస్టులు పెట్టి ఆమెను మానసికంగా వేధించడం ఇకానైన ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతంటితో ఈ చర్యలు ఆపకుంటే.. వారికి తగిన గుణపాఠం చెప్పుతామని ఈ సందర్భంలో తెలియజేశారు. పార్టీని, నాయకులను విమర్శించాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోవాలే కాని ఇలా పార్టీ సానుభూతిపరులు, మహిళ పై అసభ్య పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చారించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.