YCP Samajika Sadhikara Bus Yatra in Visakhapatnam ఎన్నికల ముందు ఒక మాట.. తర్వాత మరో మాట వైసీపీలో ఉండదు: మంత్రి బొత్స - Jagan Bus Yatra in Visakhapatnam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 7:42 PM IST
YCP Samajika Sadhikara Bus Yatra in Visakhapatnam: రాష్ట్రంలో అప్పులన్నీ నిబంధలనకు లోబడే చేస్తున్నామని మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేంద్రం ఊరుకుంటుందా అని అయన వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో సామాజిక సాధికారత బస్సు యాత్ర సందర్భంగా మీడియాతో మంత్రులు మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరిస్తున్నామని.. ఎన్నికలప్పుడు ఒక మాట, అయిన తర్వాత మరో మాట ఉండదని బొత్స అన్నారు. సామాజిక విప్లవం తీసుకువచ్చిన సీఎం జగన్ అని, రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయిలన డీబీటీ ద్వారా పంపిణీ చేశామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదరికం తగ్గించిన సీఎంగా జగన్ ప్రజలకు దగ్గరిగా ఉన్నారన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబు ఇచ్చిన హామీలు అరోజు నెరవేర్చి ఉంటే, ఇప్పుడు జగన్ పని చేయడానికి అవకాశం ఉండేది కాదన్నారు. చంద్రబాబుకి జైళ్లో భద్రత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికీ తప్పుచేయలేదని చెప్పలేకపోతున్నారని మంత్రి సిదిరి అప్పల రాజు విమర్శించారు.