YCP MPs and MLAs Absent for ZP Meeting: ప్రజా సమస్యలపై పట్టింపేదీ..? జడ్పీ సమావేశానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా - బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 3:53 PM IST

YCP MLAs MPs absent for Kadapa ZP meeting : ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం చప్పగా సాగింది. 49 మంది జడ్పీటీసీల్లో 34 మంది హాజరు కాగా... 50 మంది ఎంపీపీలకు కేవలం నలుగురు మాత్రమే వచ్చారు. జిల్లా కలెక్టర్ విజయరామరాజు కోర్టు పనిమీద హాజరుకాక పోవడంతో ఆయన స్థానంలో జేసీ గణేశ్ కుమార్ హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మూడు నెలలకోసారి నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

One MLA Attend to Meeting: పది మంది ఎమ్మెల్యేలకు ఒక్కరే హాజరు.. ఉమ్మడి కడపజిల్లాలోని పది నియోజకవర్గాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా మినహా మిగిలిన వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. కడప, రాజంపేట పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి హాజరు కాలేదు. వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. కడపకే చెందిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, రాజంపేట, కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారిపేర్లతో ముందు వరసలో రిజర్వు చేసిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. 

No Important Discussion in Meeting: కీలక పరిస్థితుల్లో చర్చలేవీ.. ఖరీఫ్ సీజన్ (Kharif season)లో వర్షాభావం కారణంలో రైతులు విత్తనం వేయక ఇబ్బందులు పడుతున్న తరుణంలో... కీలకమైన శాఖలపై చర్చించాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంపై పలువురు చర్చించుకున్నారు. మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సమస్యలు ఆలకించాల్సిన, ప్రస్తావించాల్సిన ప్రజా ప్రతినిధులకు తీరిక లేదా అని సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. కేవలం కొందరు జడ్పీటీసీ సభ్యులు (ZPTC) నామమాత్రంగా సమస్యలు లేవనెత్తడంతో సమావేశం చప్పగా సాగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) కూడా హాజరు కాలేదు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఐదుగురు మహిళా ఉపాధ్యాయులను సమావేశంలో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.