సమస్యలపై గ్రామస్థుల ఆగ్రహం.. మేకపాటి విక్రమ్ రెడ్డిని అడ్డుకుని ఆందోళన - జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత మండలంలో నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేని గుంట గ్రామంలో విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారు. ఎమ్మెల్యే వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామం అంతటా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే వచ్చేలోపు జెండాలు తొలగించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు. అనంతరం గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో పాటుగా అధికారులను గ్రామంలోని సమస్యలపై ప్రజలు నిలదీశారు. గ్రామంలో తరచూ లో ఓల్టోజ్ విద్యుత్ వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదంటూ తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎదుటే గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే గ్రామస్థులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.