'స్థానికేతరుల పెత్తనమేంటి?' - ఎమ్మెల్యే రెడ్డి శాంతి పనితీరుపై వైసీపీ నాయకుల అసంతృప్తి
🎬 Watch Now: Feature Video
YCP Leaders Unhappy With MLA Reddy Shanthi: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో వర్గపోరు మెదలవుతోంది. ఇంఛార్జ్‌ల మార్పులతో అసమ్మతి సెగ రేగుతోంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు వేరే వారిని తీసుకువచ్చి సమన్వయకర్తలు అంటే ఎలా కుదురుతుందంటూ అంటూ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు తమ వర్గీయులతో సమావేశాలు పెట్టించి ఆందోళన వ్యక్తం చేయిస్తున్నారు. మరికొందరైతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎమ్మెల్యే రెడ్డి శాంతి పనితీరుపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఏళ్లుగా పార్టీ ప్రగతి కోసం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే రెడ్డి శాంతిని గెలిపించినప్పటికీ కనీస గౌరవం, గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా స్థానికేతర నాయకులే అధికారం చెలాయిస్తున్నారని దీని వలన పాతపట్నం నియోజకవర్గం వెనుకబాటతనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్థానిక అభ్యర్థులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.