వైసీపీ నాయకుల బెదిరింపులు - భరించలేక వ్యక్తి ఆత్మహత్య - ఆత్మహత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 7:08 PM IST

YCP Leaders Threatened Man Suicide: వైసీపీ నాయకుల ధనదాహానికి సొంత పార్టీ సానుభూతిపరులు బలవుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇసుకపల్లి గ్రామంలో మృతుడు సురేంద్రకు చెందిన మూడు సెంట్ల స్థలంపై వైసీపీ నాయకులు దాసరి పెంచలయ్య, సత్యాల రామకృష్ణ కన్ను పడింది. దీంతో ఇద్దరు కలిసి ఆ భూమిని  ఆ‌క్రమించేందుకు ప్లాన్ వేశారు. స్థలం తమదే అంటూ సురేంద్రకి ఫోన్ చేసి బెదిరించడంతో మనస్థాపానికి గురైన సురేంద్ర గుళికల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. 

మృతుడు తమ్ముడు సందీప్ మాట్లాడుతూ తమ స్థలంపై కన్నేసిన వైసీపీ నాయకులు పెంచలయ్య, రామకృష్ణలు మా అన్నను బెదిరించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అన్న మృతికి ముమ్మాటికీ వైసీపీ నాయకులే కారణమంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.