ప్రతిపక్షాల సానుభూతిదారుల ఓట్ల ఏరివేతకు 'ఫామ్-7' వాడుతున్న వైసీపీ నేతలు - ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుల ఆగ్రహం

🎬 Watch Now: Feature Video

thumbnail

YCP Leaders Submitted Form 7 to Delete Votes: ఫామ్-7 ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వందలాది ఓటర్లను తొలగించాలని దరఖాస్తు చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. తాజాగా ఫా-7 ద్వారా ఓట్లు తొలగించాలని 858 దరఖాస్తులు రాగా.. అందులో శేషిరెడ్డి కొండా, పులుసు వెంకటరెడ్డి, వెంకాయమ్మ సిద్ది, శేషిరెడ్డి చల్లా తదితరులు అధికంగా ఫామ్-7 దరఖాస్తులు పెట్టారు. ఓటర్ల జాబితా మార్పులు చేర్పులకు సంబంధించి అధికార వైసీపీ పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతుందని గుంటూరు ఓటర్లు మండిపడుతున్నారు. ఓటమి భయంతో స్థానిక నేతలు ఫామ్-7 ను అడ్డుపెట్టుకుని  ఓటర్ల జాబితా నుంచి తమకు వ్యతిరేకం అనుకున్నవారిని తొలగించేందుకు పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

Form 7 Applications to Remove Votes: గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/19 లోని 140 పోలింగ్ బూత్ పరిధిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 23 మంది ఓట్లు తొలగించాలంటూ వైసీపీ నేత శేషిరెడ్డి కొండా దరఖాస్తు చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటూ, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నా.. కావాలనే తమ పేర్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. జేకేసీ కళాశాల రోడ్డులోని నవభారత్ నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో 30 మంది నివాసం ఉంటుండగా.. వారిలో 12 మంది ఓట్లు తొలగించాలని పులుసు వెంకటరెడ్డి అనే వైసీపీ నేత దరఖాస్తు చేయడం పట్ల అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటు హక్కు తొలిగించమని చెప్పే అధికారం ఎవరిచ్చారని, దరఖాస్తు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.