YCP Leaders Meet: 'అధికారం మాది.. పెత్తనం మీదా..' సత్తెనపల్లి వైసీపీలో అంబటి వ్యతిరేకవర్గం భేటీ - ysrcp sarpanch meet against minister ambati
🎬 Watch Now: Feature Video
YCP leaders meet against minister Ambati : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయట పడుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గతంలో పలుమార్లు సమావేశమైన నేతలు తిరిగి సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు సమావేశం అయ్యారు. వైసీపీ నేత చిట్టా విజయబాస్కర్ రెడ్డి ఇంట్లో అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు భేటీ అయ్యారు. మంత్రి అంబటి రాంబాబు తమను పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనం పెరిగిందని, స్థానిక ప్రజాప్రతినిధులను తమని విస్మరించి కార్యక్రమాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యపై మంత్రి అంబటిని కలవాలని ప్రయత్నిస్తున్నా కుదరటం లేదని వారు తెలిపారు. రెండు రోజుల్లో మరో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తెనపల్లి రూరల్ పరిధిలోని 11 మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
TAGGED:
అంబటికి వ్యతిరేకంగా సమావేశం