ఓట్ల పరిశీలనకు వచ్చిన బీఎల్వోలకు షాక్ - ప్రభుత్వ భవనాన్ని నివాసంలా మార్చుకున్న వైసీపీ నేతలు - ప్రభుత్వం భవనం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 4:41 PM IST
YCP Leaders Family Residence in GOVT Building: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లిలో ఓట్లు పరిశీలించడానికి వెళ్లిన బీఎల్వో అధికారులకు షాక్ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే తుడా నిధులతో మహిళ సమాఖ్య, గ్రంథాలయం కోసం భవనాన్ని నిర్మించారు. కొన్ని నెలలుగా గుర్రం కొండ కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి నివాసం ఉంటున్నట్లు బీఎల్వోలు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ అండతో అధికార పార్టీ నేతలు నివాసం ఉంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలలుగా వైసీపీ నేతలు నివాసం ఉంటున్నా.. అధికారులు మాత్రం చూసీ చూడనట్లు ఉన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
"స్థానిక ఎమ్మెల్యే తుడా నిధులతో మహిళా సమాఖ్య, గ్రంథాలయం కోసం భవనాన్ని నిర్మించారు. కొన్ని నెలలుగా గుర్రం కొండ కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి నివాసం ఉంటున్నట్లు బీఎల్వోలు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ అండతో అధికార పార్టీ నేతలు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా వైసీపీ నేతలు నివాసం ఉంటున్నా.. అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు." - హరి, గ్రామస్థుడు