Nazir Ahmed on jagan: ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు.. వైసీపీ పాలనలో రక్షణ లేదు: నజీర్ అహ్మద్ - టీడీపీ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్
🎬 Watch Now: Feature Video
Nazir Ahmed comments on CM Jagan: ముస్లిం సామాజిక వర్గాన్ని జగన్ బానిసలుగా చూస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయింది.. వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్వర్ భాషా పైన అక్రమ కేసులతో ఇబ్బందులు గురి చేసి వేధించాలని.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో 50 ముస్లిం కుటుంబాలకు నష్టం కలిగించటమే కాకుండా.., పది మంది మైనార్టీలు మరణానికి ఈ ప్రభుత్వం కారణమైందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు కుట్రతోనే అన్వర్ భాషపైన అక్రమ కేసును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జగన్ ముస్లింలకు వ్యతిరేకంగా తయారయ్యారని విమర్శించారు. ముస్లింలకు న్యాయం జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే అని స్పష్టం చేసారు. జగన్‌కి ఇక రాజకీయ అవకాశాలు లేకుండా ముస్లిం సమాజం చేయడానికి సిద్ధమైందని పేర్కొన్నారు.