Indian Army Recruitment : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాల ర్యాలీ కేరళలో జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్, బీఎస్సీ, డిప్లొమా విద్యార్హతతో ర్యాలీలో పోటీ పడొచ్చు.
వాయుసేన నియామకాల ర్యాలీ
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శారీరక, రాతపూర్వక, మెడికల పరీక్షలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు శిక్షణ తర్వాత ఎయిర్ మెన్‌గా తొలి నెల నుంచే రూ.50వేలకు పైగా వేతనం పొందే వీలుంది.
నిరుద్యోగులకు అల్టర్- IBPS ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్- కచ్చితంగా తెలుసుకోవాల్సిన డేట్స్ ఇవే!
కేరళలోని ఎర్నాకుళం, కోచిలో మహారాజా కాలేజ్ గ్రౌండ్, పీటీ ఉష రోడ్, షెనాయ్స్ లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ర్యాలీ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్వహించనున్నారు. గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాల్లో ర్యాలీ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇందులో పాల్గొనే వీలుంది. ఫిబ్రవరి 1న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ విద్యార్థులు ఫిబ్రవరి 4న రిపోర్ట్ చేసి 4, 5 తేదీల్లో ర్యాలీలో పాల్గొనవచ్చు. 4, 5 తేదీల్లో ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత ఒరిజినల్ పత్రాలు, వాటి నకళ్లు, ఫొటోలు, పరీక్ష సామగ్రితో వెళ్లాల్సి ఉంటుంది. దేహ ధారుడ్య పరీక్షలతో పాటు రాత పరీక్ష, వైద్య పరీక్షలు ఉంటాయి.
దేహ ధారుడ్య పరీక్ష పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 21 ఏళ్ల కంటే ఎక్కువ వయసువారైతే 7 నిమిషాల 30 సెకన్లలో చేరుకోవాలి. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 పుష్‌అప్స్, 10 సిట్‌అప్స్, 20 స్క్వాట్స్ పూర్తిచేస్తేనే అర్హత సాధిస్తారు.
దీన్ని ఫిజికల్ ఫిట్‌నెస్‌లో ఉత్తీర్ణులైనవారికి అదే రోజు రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ఇంగ్లిష్ సబ్జెక్టు మినహా మిగతా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఓఎంఆర్ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు కేటాయిస్తారు.
రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి నాలుగు తప్పులకు ఒక మైనస్ మార్కు(తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు) ఉంటుంది.
ఇంగ్లిష్ 20, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్ నుంచి ఉంటాయి. ఈ రెండు విభాగాల్లోనూ అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది. మోడల్ పేపర్ కోసం https://airmenselection.cdac.in లో చూసుకోవచ్చు.
రాత పరీక్షలో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ పరీక్ష ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాతావరణానికి, ఆ ఉద్యోగానికీ అభ్యర్థి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి తుది శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి వివరాలు మే 30న వెల్లడిస్తారు.
శిక్షణ ఇలా : ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు వాయుసేన ప్రాథమిక శిక్షణ కేంద్రంలో శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్ కేంద్రాలకు పంపిస్తారు. శిక్షణ సమయంలో రూ.14,600 ఉపకార వేతనం అందించి విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. వీరు 20 ఏళ్లపాటు (57 ఏళ్ల వయసు నిండే వరకు) ఉద్యోగంలో కొనసాగవచ్చు. మొదటి నెల నుంచే మిలటరీ సర్వీస్ పే తో కలిపి రూ.26,900 మూల వేతనం, అలవెన్సులూ కలిపి సుమారు రూ.50వేల వేతనం ఉంటుంది.
మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌లో చేరినవారు ఫస్ట్ ఎయిడ్ చేయగలిగేలా శిక్షణ తీసుకుంటారు. మెడికల్ స్టోర్లు, డిస్పెన్సరీ, వార్డు పర్యవేక్షణ వీరి విధుల్లో భాగంమై ఉంటాయి. భవిష్యత్తులో ఉద్యోగోన్నతులు ఉంటాయి. సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందే వీలుంది. ఉద్యోగ విరమణాంతరం పింఛను, ఇతర సౌకర్యాలూ పొందుతారు.
విద్యార్హతలు
ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు సాధించాలి. ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసుకున్నవారూ ఇవే సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో అర్హత పొందుతారు. డీఫార్మసీ/బీఫార్మసీ విద్యార్థులు 50 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి.
ఇంటర్మీడియట్ విద్యార్హతతో జులై 3, 2004 - జులై 3, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఫార్మసీ విద్యార్థులు జులై 3, 2001 - జులై 3, 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.
కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండడంతో పాటు ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. కంటి చూపు, వినికిడి లోపాలుంటే అనర్హులు.
TCSలో 40,000 ఉద్యోగాలు - ఏఐ, కోడింగ్ నైపుణ్యాలు మస్ట్ - త్వరలోనే ప్రకటన!
రైల్వే భారీ నోటిఫికేషన్ - న్యూ ఇయర్‌లో 32,438 గ్రూప్-డి పోస్టులు భర్తీ!