YCP Leaders Attacked on Reporter: నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. రిపోర్టర్‌పై దాడి..
🎬 Watch Now: Feature Video
YCP Leaders Attacked on Reporter: నంద్యాల జిల్లా మహానందిలో వైఎస్సార్సీపీ నేతలు వీరారెడ్డి, అతని అనుచరులు రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు. నేతల అక్రమాలపై వార్తలు రాశారన్న కక్షతో.. జగనన్న సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అధికార పార్టీ నేతలను అదుపు చేశారు. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కొద్ది దూరంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. దాడిపై బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఓ రైతు పంటకు అమర్చిన డ్రిప్పును అధికార వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు తొలగించిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధిత రైతు ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రామగిరి మండలం కలికివాండ్ల పల్లికి చెందిన రైతు శ్రీధర్‌కు కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 578-3లో 4.87 సెంట్ల డి.పట్టా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన డి.పట్టాను 2007లో అధికారులు తనకు ఇచ్చినట్లు చెప్పాడు. కాగా రెండు రోజుల క్రితం ఆ భూమిలోనే 2ఎకరాల్లో బూడిద గుమ్మడి విత్తనం వేసి డ్రిప్పు అమర్చినట్లు బాధితుడు తెలిపాడు. అయితే అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు రాత్రి వేళల్లో వచ్చి డ్రిప్పును ధ్వంశం చేసినట్లు ఆరోపించాడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూమి తనదే అంటూ తనపై దౌర్జన్యం చేస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. వ్యవసాయంపై ఆధారపడి ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్న తనకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని వేడుకున్నాడు.