YCP Leader on Contractors Bills: నోరున్న వారికే బిల్లులు.. మిగతా వారికి ఆత్మహత్యలు.. అనంత నగరపాలక సంస్థ అధికారుల తీరుపై మండిపడిన వైసీపీ నేత - వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు గంగన లక్ష్మిరెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 2:28 PM IST

Updated : Sep 18, 2023, 5:24 PM IST

YCP Leader on Contractors Bills  అనంతపురం నగరపాలకలోని పలు విభాగాల్లో అవినీతి, అధికారుల తీరు, ప్రజా ప్రతినిధుల సిఫార్సులను తప్పుపడుతూ.. వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు గంగన లక్ష్మిరెడ్డి చేస్తున్న విమర్శలు కలకలం రేగింది. నగరపాలకలో ఏం జరుగుతుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. నోరున్న వారికే బిల్లులు పాస్ అవుతున్నాయని మిగతా వాళ్లకి ఆత్మహత్య శరణ్యమవుతున్నాయన్నారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూలోని అన్ని విభాగాల్లో అవినీతి జరుగుతున్నా భయంతో ఎవరూ మాట్లాడటం లేదన్నారు. అక్రమకట్టడాలు, అనధికారిక సెల్లార్లు సాగుతున్నా కమిషనరు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. ఎవరైనా అధికారులు నిజాయతీగా ఉందాం అనుకున్నా.. వారిని బదిలీ చేయించి అవినీతిపరులు, అర్హత లేని ఉద్యోగులను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో నగరపాలికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వీటన్నిటిపై పోరాటం చేస్తామని గంగన లక్ష్మిరెడ్డి అన్నారు.

"అనంతపురం నగరపాలకలో నోరున్న వారికే బిల్లులు పాస్ అవుతున్నాయని మిగతా వాళ్లకి ఆత్మహత్య శరణ్యం. పట్టణ ప్రణాళిక, రెవెన్యూలోని అన్ని విభాగాల్లో అవినీతి జరుగుతున్నా భయంతో ఎవరూ మాట్లాడటం లేదు. అక్రమకట్టడాలు, అనధికారిక సెల్లార్లు సాగుతున్నా కమిషనరు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఎవరైనా అధికారులు నిజాయతీగా ఉందాం అనుకున్నా.. వారిని బదిలీ చేయించి అవినీతిపరులు, అర్హత లేని ఉద్యోగులను తెచ్చుకుంటున్నారు." - గంగన లక్ష్మిరెడ్డి, వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు

Last Updated : Sep 18, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.