YCP Activist Protest Against Ruling Party MLA: కార్యకర్తల సమస్యలు తీర్చలేనివారు.. ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం..? వైసీపీ కార్యకర్త ఆవేదన - YCP activist Sheikh Abbas protest video
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 2:26 PM IST
|Updated : Oct 24, 2023, 6:33 PM IST
YCP Activist Protest Against Ruling Party MLA: వైసీపీలో నాయకుల్లో, కార్యకర్తల్లో రోజులు గడిచేకొద్దీ వారిలో ఉన్న అసంతృప్తి బయటకు వస్తోంది. తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేపై అసంతృప్తిని వెలిబుచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన షేక్ అబ్బాస్ అనే వైసీపీ కార్యకర్త.. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తనకు ఉన్న అసంతృప్తిని వ్యక్తపరిచాడు. ఎమ్మెల్యే కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బైక్పై వైసీపీ స్టిక్కర్లు, కాసు మహేష్ ఫొటో పెట్టుకుని తిరుగుతున్నానని.. అలాంటిది ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మహేష్ రెడ్డిని కలిసి మాట్లాడదామంటే పట్టించుకోవటం లేదని అన్నాడు. కార్యకర్తల సమస్యలు తీర్చలేనివారు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని నిలదీశారు. తన వాహనంపై ఉన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫొటోని చించివేసి అతను నిరసన తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.