నెల్లూరు జిల్లాలో పోలీసుల నిర్వాకం - అర్థరాత్రి కారుమాయం! - nellore latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 12:25 PM IST

Yanadi Welfare Association State President Penhalaya Fires On Minister Kakani : నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి ప్రొద్భలంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వేధిస్తున్నాడని అందోళన చేపట్టిన యానాది సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గిరిజనల హక్కుల కోసం పోరాడుతుంటే మంత్రి కాకాణి తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య ఆరోపించారు. తనపై క్రిమినల్​ కేసు నమోదు చేశారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి పోలీసులు వచ్చి కారుని తీసుకెళ్లారని పెంచలయ్య ఆరోపించారు.  

Yanadi Community Fires On Minister Kakani : ఉపాధి నిమిత్తం ఎన్​ఎస్​టీఎఫ్​డీసీ (National Scheduled Tribes Finance and Development Corporation) కింద తనకు మంజూరైందని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు దోపిడీ దొంగల్లా అర్ధరాత్రి వేళ తన కారును తీసుకుపోవాల్సిన అవసరమేంటని ఐటీడీఏ వద్ద అధికారులను, పోలీసులను ప్రశ్నించారు. అధికారుల తీరును ఖండిస్తూ యానాది సంఘం నాయకులు ITDA (Integrated Tribal Development Agency) కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బలవంతంగా పోలీసుస్టేషన్ కు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.