World Space Week celebrations in Rajahmundry : రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు.. ఆకట్టుకున్న ప్రదర్శనలు - Latest East Godavari News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 8:38 AM IST

World Space Week celebrations in Rajahmundry : రాబోయే రోజుల్లో అంతరిక్ష పర్యాటకం రాబోతోందని, అందుకు అనుగుణంగా ఇస్రో పరిశోధనలు, ప్రయోగాలు సాగిస్తోందని శ్రీహరికోట S.D.S.C డిప్యూటీ డైరెకర్ టీఎస్. రఘురామ్ అన్నారు. ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మ నిర్బర్ భారత్, స్వాతంత్ర్య అమృతోత్సవం నేపథ్యంలో అంతరిక్ష విజ్ఞానాన్ని ఇంటింటికి తీసుకెళ్లే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2016 నుంచి అంతరిక్ష వారోత్సవాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని జిల్లాస్థాయి, మడల స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 'స్పేస్ అండ్ ఎంటర్రెన్యూర్ షిప్' పేరుతో అంతరిక్ష వారోత్సవాలు చేస్తున్నామన్నారు. శ్రీహరికోట షార్ L.S.S.F జనరల్ మేనేజర్ ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్​లో రాజమండ్రితో పాటు విశాఖ, కర్నూల్, శ్రీహరి కోటలలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్వహించిన స్పేస్ వాక్ మంచి స్పందన లభించింది అన్నారు. 3500మంది విద్యార్థులు పాల్గొనడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్, ప్రెస్ క్లబ్ సంయుక్త సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్ నమూనాల ప్రదర్శనను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. పద్మరాజు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.