శ్మశాన వాటికపై వైసీపీ నేత ఆంక్షలు - మహిళలు, గ్రామస్థుల ధర్నా - Kurnool District revenue office News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 8:58 PM IST
Womens Protest For Graveyard: తమ గ్రామానికి శ్మశాన వాటికను కేటాయించాలంటూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఏ. నాగులాపురానికి చెందిన మహిళలు, గ్రామస్థులు రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తరతరాలుగా వస్తోన్న తమ ఊరి శ్మశాన వాటికను వైసీపీకి చెందిన ఓ నాయకుడు పట్టా చేసుకున్నారని, ఇకపై శ్మశాన వాటికను ఉపయెగించుకోవద్దంటూ ఆంక్షలు విధించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
A.Nagulapuram Villagers Comments: ''మాది ఏ. నాగులాపురం గ్రామం. తరతరాలుగా మా గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు జరుపుతున్నాం. తాజాగా స్థానిక వైసీపీ నాయకుడు శ్రీథర్ రెడ్డి ఆ స్థలం (శ్మశాన వాటిక) పట్టా చేసుకున్నామని, ఇకపై ఎవ్వరూ శ్మశాన వాటికలో అడుగుపెట్టొద్దని ఆంక్షలు విధించారు. దాంతో మా గ్రామంలో శ్మశాన వాటికే లేకుండా పోయింది. అధికారులు స్పందించి మా శ్మశాన వాటికను మాకు ఇప్పించాలని ఈరోజు ధర్నా చేపట్టాం. ఎప్పటినుంచో ఉన్న పాత శ్మశాన వాటికనే మా గ్రామానికి కేటాయించాలని అధికారులను కోరుతున్నాం. అధికారులు ఈ విషయంలో మాకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం'' అని ఏ. నాగులాపురం గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు.