మొన్న ధర్మాన, నేడు వైవీ సుబ్బారెడ్డి.. ప్రసంగ సమయంలో వెనదిరిగిన మహిళలు - YV Subba Reddy Meeting in vishaka
🎬 Watch Now: Feature Video
YSRCP Uttarandhra INCharge YV Subba Reddy : ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకుల సభలు ఎవైనా, సమావేశాలు ఎక్కడ ఏర్పాటు చేసిన మధ్యలోనే ప్రజలు వెనుతిరగుతున్నారు. అధికార వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల నుంచి ప్రజలు సమావేశాల మధ్యలోనే ఇళ్లకు తిరిగి వెళ్లటం పరిపాటిగా మారింది. మొన్న శ్రీకాకుళంలో ధర్మాన ప్రసంగిస్తుండగా మహిళలు వెనుదిరిగితే.. ఇప్పుడా వంతు వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి వచ్చింది. ఉత్తర విశాఖ నియోజకవర్గం పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీయల్బీ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. ఆయన ప్రసంగ సమయంలో మధ్యలోనే సమావేశం నుంచి మహిళలు వెనుదిరిగి వెళ్లిపోయారు. వెళ్లటానికి దారి లేకపోవటంతో సమీపంలోని గోడ దూకి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లకూడదని ఎంత వారించినా మహిళలు వినలెేదు. సాయంత్రం వరకు సభ ప్రాంగణంలోనే ఉంచుతారా అంటూ మహిళలు రుసరుసలాడారు.
మొన్న శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసంగ సమయంలోనూ ఇదే జరిగింది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే మంత్రి స్పందిస్తూ.. 'ఐదు నిమిషాల్లో సమావేశం పూర్తి కానుంది తల్లి.. వెళ్లిపోదురు ఆగండి' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.