Women Questioned MLA Mekapati Vikram Reddy: రోడ్లపై వరినాట్లు వేయొచ్చు.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని అడ్డుకున్న మహిళలు - ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి చేదు అనుభవం
🎬 Watch Now: Feature Video

Women Questioned MLA Mekapati Vikram Reddy about Roads: అధికార నేతలకు అడుగడుగునా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. నాలుగేళ్లుగా ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై, పథకాల గురించి ఇలా అనేక సమస్యలపై ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఎటూరు పంచాయితీ.. ఎన్వీ కండ్రిక గ్రామంలో రోడ్ల దుస్ధితిపై స్థానికులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎన్వీ కండ్రిగ గ్రామానికి వచ్చారు. వర్షాలు పడకుండానే రోడ్లపై వరినాట్లు వేయొచ్చని.. వర్షాలు పడితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పలేమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందా అంటూ.. మహిళలు ప్రశ్నించారు. రోడ్లన్నీ బురదమయంగా ఉన్నాయని.. రాళ్లు వేసుకుని నడవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా ప్రజలు నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే మెకపాటి విక్రమ్ రెడ్డి వెనుతిరిగారు.