Women Bike Rally to Raise Breast Cancer Awareness: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన.. విశాఖలో మహిళల బైక్ థాన్ - మహిళల బైక్ థాన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 2:24 PM IST
Women Bike Rally to Raise Breast Cancer Awareness: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విశాఖలో మహిళలు బైక్ థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌సీజీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ థాన్‌ను మేయర్ హరివెంకట కుమారి జెండా ఊపి ప్రారంభించారు. బీచ్ రోడ్ ఉడా పార్క్ నుంచి తెన్నేటి పార్క్ వరకు సాగిన ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా పరిగణిస్తున్న సందర్భంగా హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నెలరోజుల పాటు ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు.
"రొమ్ము క్యాన్సర్ బారిన పడి దేశంలో ప్రతి సంవత్సరం వేలల్లో మహిళలు మరణిస్తున్నారు. మహిళల్లో సరైన అవగాహన లేకపోవడం, కొంతమందికి బయటకు చెప్పుకోవటం ఇష్టం లేకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము." - హరివెంకట కుమారి, మేయర్