Woman dies honey bee attack: తేనెటీగల దాడిలో మహిళ మృతి.. బాలుడికి తీవ్ర గాయాలు - Woman dies honey bee attack in ap
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-09-2023/640-480-19631137-thumbnail-16x9-woman.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 6:08 PM IST
Woman dies honey bee attack: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పిఆర్ పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం పనులు చేసుకుంటున్న ఓ కుటంబంపై తేనెటీగలు దాడి చేసిన ఘటనలో మహిళ చనిపోగా మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఒకే కుటుంబానికి చెందిన... పకూర్ బి, మహబూబ్ బాషా, షబ్బీర్, భాష నలుగురు కలిసి పొలంలో పనిచేస్తున్నారు. పొలంలో చెట్టు కింద నిప్పు పెట్టగా.. ఆ చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో పకూర్బీ మృతి చెందింది. షబ్బీర్ అనే బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడిని డోన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పకూర్ బి పరిస్థితి విషమంగా ఉండడంతో డోన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యమంలో పకూర్ బి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పకూర్ బి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.