Woman Allegations on Minister Ambati: షాపు ఖాళీ చేయాలని వేధిస్తున్నారు.. మంత్రి అంబటిపై మహిళ ఆరోపణ
🎬 Watch Now: Feature Video
Woman Complaint on Minister Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు.. ఆయన అనుచరులతో కలిసి వేధిస్తున్నారని.. ఓ మహిళ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన శివనాగమణీశ్వరి.. బ్రాడిపేటలోని అంబటి షాపింగ్ కాంప్లెక్స్‌లో పింక్ అండ్ బ్లూస్ పేరిట ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. కాగా.. అద్దె సరిగా చెల్లించని కారణంగా ఆమెను ఖాళీ చేయించేందుకు అనుచరుల్ని పంపించినట్లు మహిళ ఆరోపించారు. రాత్రి వేళ వచ్చి బ్యూటీపార్లర్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారని ఆమె తెలిపారు. ఖాళీ చేయటానికి సమయం అడిగినా కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని శివనాగమణీశ్వరి చెబుతున్నారు. తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన 3.60 లక్షలు రూపాయలు ఉన్నప్పటికీ.. షాపు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారని ఆమె వాపోయింది. ఇప్పుడు అదే షాప్‌ను బార్ కోసం అద్దెకు ఇస్తున్నారని, అందుకే తనపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు భరించలేకే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు శివనాగమణీశ్వరి తెలిపారు.