Wildlife movement in Tirumala footpaths: 'కాలినడక భక్తులు గుంపులుగా వెళ్లాలి'.. చిరుతల సంచారంపై అటవీ అధికారులు ఏమన్నారంటే..! - వెంకటేశ్వర గుడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 5:17 PM IST
Leopards Are Coming Due to Increased red Sandalwood Smuggling: తిరుమల కాలినడక మార్గాలలో వన్యమృగాల కదలికలపై 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తిరుపతి సీసీఎఫ్(Chief Conservator of Forest Nageswara Rao) నాగేశ్వర రావు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. చిరుత, ఎలుగు బంటి కాలినడక పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని... మెట్ల మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. తితిదే(TTD) నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపారు. నడక మార్గంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పట్టుకున్న రెండు చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుతను డీఎన్‍ఏ రిపోర్ట్ ద్వారా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. కంచె ఏర్పాటుపై భారత వన్య సంరక్షణ విభాగం అనుమతుల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జంతువుల సంపర్కం సమయం.. అందువల్ల చిరుతల కదలికలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ అవ్వడం వల్ల చిరుతలు వస్తున్నాయనే ఆరోపణలను ఆయన ఖండించారు.
TAGGED:
about ttd cheta attack