Wife Relatives Attack On Husband and His Lover in Hindupur: హిందూపురంలో దారుణం.. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అరగుండు కొట్టించి ఊరేగింపు - హిందుపురం అరుగుండు కొట్టించి ఊరేగించిన ఘటన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2023, 12:00 PM IST
|Updated : Sep 5, 2023, 2:56 PM IST
Wife Relatives Attack On Husband and His Lover In Hindupur: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తికి అతని ప్రియురాలికి.. భార్య బంధువులు అరగుండు కొట్టించారు. అంతేకాకుండా ఆ వ్యక్తిని అతని ప్రియురాలికి అరగుండు కొట్టించిన అనంతరం పట్టణంలో ఊరేగించారు. స్థానికులు దీనిని గమనించి ఇది సరికాదని భార్య బంధువులకు సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం తిలక్‌నగర్‌కు చెందిన ఓ మహిళను.. పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. అయితే వివాహం చేసుకున్న ఆ వ్యక్తి.. హిందూపురానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య.. భర్తను పలుమార్లు హెచ్చరించింది. భర్తను హెచ్చరించినా తీరు మారకపోవటంతో.. సహనం కోల్పోయిన భార్య బంధువులు.. భర్త, ప్రియురాలితో కలిసి ఉన్న సమయంలో పట్టుకున్నారు. అనంతరం ఇద్దరికి దేహశుద్ధి చేశారు. భర్తకు, ప్రియురాలికి అరగుండు గీయించి.. చెప్పులు మెడలో వేసి హిందుపురం పట్టణంలో ఊరేగించారు.