Water Release from Tungabhadra Dam: అనంతలోకి ప్రవేశించిన తుంగభద్ర జలాలు.. రైతుల హర్షం - Department of Water Resources
🎬 Watch Now: Feature Video
Tungabhadra water reach the Andhra border : తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దు చేరాయి.. తుంగభద్ర డ్యాం నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(HLC) ద్వారా విడుదలైన నీరు అనంతపురం జిల్లా బొమ్మనహల్ వద్ద గల ఆంధ్ర సరిహద్దులోని 105 కిలోమీటర్‌కు చేరుకున్నాయి. నీటి విడుదల కోసం అనంతపురం జల వనరుల శాఖ ఎస్సీ రాజశేఖర్.. తుంగభద్ర బోర్డుకు లేఖ ద్వారా ఇండెంట్ పెట్టటంతో అధికారులు తుంగభద్ర ఎగువ కాలువకు వెయ్యి క్యూసెక్కులు మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బొమ్మనహల్ వద్ద 1065 క్యూసెక్కుల నీరు చేరింది. హెచ్ఎల్సి కెనాల్ ద్వారా తుంగభద్ర జలాలు రావడంతో అనంతపురం జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నీటి ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకు తాగునీరు దాహార్తి తీర్చడంతో పాటు సాగునీటి అవసరాలు తీరనున్నాయి. హెచ్ఎల్సీ ఆయకట్టు కింద అనంతపురం జిల్లాలో 1.20 లక్షల ఎకరాల మాగాణి భూములు సాగు అవుతాయి. నీళ్లు విడుదల చేయడంతో రైతులు వరి, మిరప, మొక్కజొన్న, సజ్జ, కూరగాయల తదితర పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.