ఊరుకూటి చందు వద్దు - వైవీ సుబ్బారెడ్డి ఎదుట నాగిరెడ్డి మద్దతుదారుల ఆందోళన - ysrcp news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 4:37 PM IST
Vurukuti Chandu name finalized as YSRCP MLA candidate: విశాఖ జిల్లా గాజువాక వైఎస్సార్సీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊరుకూటి చందును ప్రకటించారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడి పని చేసిన వారిని కాదని కొత్త వారికి ఎలా అవకాశం ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వకుంటే పార్టీకి సహకరించేది లేదని తేల్చిచెప్పారు.
నాగిరెడ్డి 5 సంవత్సరాలు కష్టపడి పని చేశారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వపోవడం అన్యాయమని అవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డికి టికెట్ ఇవ్వపోవడం విస్మయానికి గురి చేస్తోందని కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కార్యకర్తలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలోని సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆదేశాలతో బీసీ నేత అయిన ఊరుకూటి చందును ప్రకటించినట్లు తెలిపారు. స్థానికంగా వస్తున్న అభిప్రాయాల్ని సైతం పరిగణలోకి తీసుకుంటామని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని వైవీ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.