వీఆర్ఏల నిరసన బాట - విశాఖ గాంధీ విగ్రహం, విజయనగరం కలెక్టరేట్ ముట్టడి - ap latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:22 PM IST
VRAs Protest In Visakha And Vizianagaram : వేతనాలు పెంచాలని, పే స్కేల్, డీఏ వర్తింపు చేయాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆందోళన నిర్వహించింది. విశాఖ గాంధీ విగ్రహం, విజయనగరం కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ స్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 24 వేలమంది వీఆర్ఎలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నామినీలుగా పని చేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.