Volunteers Complaint on MLA Kilari Rosaiah in Spandana: ఎమ్మెల్యే రోశయ్యతో ప్రాణహాని ఉంది.. స్పందనలో వాలంటీర్లు ఫిర్యాదు - పొన్నూరు నియోజకవర్గంలో వర్గపోరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 8:22 PM IST

Volunteers Complaint on MLA Kilari Rosaiah in Spandana: వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లాలో వాలంటీర్లు​ స్పందనలో ఫిర్యాదు చేశారు. మీ అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే తమను బెదిరించారని వాపోయారు. ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదనకు లోనయ్యారు. స్పందనలో ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మన్నవ గ్రామ వాలంటీర్లు అన్నారు. ఇటీవల మన్నవ గ్రామంలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే రోశయ్య పాల్గొన్నారని.. ఆ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మీ అంతు చూస్తనంటూ గ్రామ ప్రజల ముందే ఎమ్మెల్యే బెదిరించారని ఆవేదనకు లోనయ్యారు. తాము రావి వెంకటరమణకు (Raavi Venkataramana) మద్దతుగా ఉంటామని భావించి ఉద్దేశ్యపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. గత ఎన్నికల్లో రోశయ్యను గెలిపించుకోవటానికి పార్టీ తరఫున కృషి చేసినట్లు వాలంటీర్లు వివరించారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.