Volunteer Murdered Old Woman for Gold: విశాఖలో వాలంటీర్ ఘాతుకం.. బంగారం కోసం వృద్ధురాలి హత్య.. - విశాఖ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Volunteer Murdered Old Woman for Gold Chain: విశాఖ జిల్లా పెందుర్తిలో ఓ వాలంటీర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. సుజాతనగర్ 80 ఫీట్ల రోడ్‌లో బంగారం కోసం వరలక్ష్మి అనే వృద్ధురాలిని వాలంటీర్ వెంకట్ హత్య చేశాడు. 95వ వార్డు పురుషోత్తపురంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకట్.. నెలరోజుల క్రితమే వరలక్ష్మి కుమారుడు వద్ద ఫుడ్‌కోర్డులో పనికి చేరాడు. అదును చూసి వృద్ధురాలి(72)ని హత్య చేసి బంగారంతో సహా ఉడాయించాడు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో వృద్ధురాలి హత్య జరిగి ఉండొచ్చని అంచనా వేసిన అధికారులు.. అతి స్వల్ప వ్యవధిలోనే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వృద్ధురాలి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. వాలంటీర్ చోరీ చేసే యత్నంలో వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.