కట్నం కోసం మరదలిని వేదిస్తున్న వాలంటీర్! పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితురాలి ఆరోపణ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 3:40 PM IST

Volunteer Harassing Woman for Dowry in Palnadu District : ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వివాహితను.. కట్నం కోసం భర్త సోదరుడైన వాలంటీర్ వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాకానివారి పాలెం ఎస్సీ కాలనీకి చెందిన కృష్ణవేణి, మేనమామ కుమారుడైన ఆటో డ్రైవర్‌ భిక్షంను 2020లో ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత భర్త కూలీ పనులకు వెలుతూ మద్యానికి బానిసయ్యాడు. 

ఈ క్రమంలో కట్నం తీసుకురావాలంటూ.. అత్తమామలు, భర్త సోదరుడు వేధిస్తున్నారని కృష్ణవేణి వాపోయింది. అత్తింటి వారి వేధింపులు తాళలేక ఏడాది క్రితం గర్భణీగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్లిపోయినా.. వేధింపులు తప్పడం లేదని ఆమె కన్నీటిపర్యంతం అవుతోంది. తరచూ కట్నం కోసం ఇంటి వద్దకు వచ్చి ఆమె బావ సాగర్‌ దుర్భాషలాడుతున్నారని ఓ ధశలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సర్ధిచెప్పి పంపించారని వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం తన బావ తీవ్రంగా దాడి చేసి కొట్టారని ఆమె ఆరోపించింది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని కృష్ణవేణి వాపోయింది. తాను వాలంటీర్‌ అని.. పలుకుబడి ఉందని, ఎవరూ ఏమి చేయలేరని బావ సాగర్‌ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వాలంటీర్‌ సాగర్‌తో తనకు ప్రాణహాని ఉందని సామాజిక మాధ్యమం ద్వారా బోరున విలపించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.