Vizianagaram Utsavalu: గ్రామీణ కళల కాణాచి.. కనుల పండువగా విజయనగరం ఉత్సవాలు - పైడితల్లి ఆలయం వివరాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 3:30 PM IST

Updated : Oct 29, 2023, 6:44 PM IST

Vizianagaram Utsavalu: విజయనగరం జిల్లా ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయలను చాటిచెప్పేలా రెండో రోజులు పాటు నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాలను మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖులు, కళాకారులు సమక్షంలో విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద ఉత్సవాలకు శంఖం పూరించారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి సూచికగా ఆలయం నుంచి గురజాడ కళా క్షేత్రం వరకు భారీ సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది కళాకారులతో ఈ ర్యాలీ సాగింది.

పైడితల్లి ఆలయం నుంచి కోట, సింహాచలం మేడ, సంస్కృత కళాశాల, గురుజాడ కళాక్షేత్రం వరకు సాగిన ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు భళా అనిపించాయి. కత్తిసాము, కర్రసాము, కోలాటం, థింసా నృత్యం, చెక్కభజన, పులివేషాలు, తప్పెటగూళ్ల ప్రదర్శనలు గ్రామీణ కళల వైభవాన్ని చాటాయి. అనంతరం నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక, నృత్యప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ... పాతికేళ్ల నుంచి ఏటా ఆనవాయితీగా విజయనగరం ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్ల నుంచి నామమాత్రంగా నిర్వహించగా... ఈ ఏడాది తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవటం ఆనందంగా ఉందన్నారు.  

Last Updated : Oct 29, 2023, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.