Vishwakarma idol in Chandrayaan3 Model:ఆకట్టుకుంటున్న చంద్రయాన్ 3 నమూనాలోని.. నవిశ్వకర్మ విగ్రహం - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 5:13 PM IST
Vishwakarma Idol in Chandrayaan 3 Model in Semiliguda : ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గల సెమిలిగూడలో చంద్రయాన్ 3 నమూనాలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ విగ్రహం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజలు నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది విభన్నంగా చంద్రయాన్ 3 నమూనాలో పూజ మండపాన్ని తయారు చేశారు. ఇప్పటికే చంద్రయాన్ 3 విజయవంతం కావటం వల్ల.. విశ్వకర్మ ఉత్సవాల్లో ఈ నమూనా ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. ఈ నమూనాను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
చంద్రయాన్ 3 నమూనాను సెమిలిగూడకు చెందిన బులి మిస్త్రీ బృందం ఏర్పాటు చేశారు. బులి మిస్త్రీ 15 మంది సభ్యులతో కూడిన బృందంతో.. కలప, పైపుల సహాయంతో చంద్రయాన్3, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల నమూనాను తయారు చేశారు. చంద్రయాన్ 3ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించినట్లే.. ఈ పూజ కార్యక్రమాలను మొదలుపెట్టారు. చంద్రుని మీద విశ్వకర్మ విగ్రహం పెట్టారు. విక్రమ్ ల్యాండర్ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.