తోలు తీస్తా.. తమాషా చేస్తున్నావా..? సస్పెండ్ చేయిస్తాను మేయర్ భర్త హల్చల్ - కానిస్టేబుల్‌ని మేయర్ భర్త దూషించాడు
🎬 Watch Now: Feature Video

విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై మేయర్ భర్త నోరుపారేసుకున్నారు. అందరి ముందే ఇష్టారీతిన తిడుతూ.. ఉద్యోగం నుంచి పీకిపారేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విశాఖలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రోజు విశాఖ మేయర్ హరి వెంకట కుమారి భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు గోలగాని శ్రీనివాసరావు పోలీసు సిబ్బందితో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఈ ఘటన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగింది. పోలీస్ సిబ్బందిని తోలు తిసేస్తాను.. తమాషా చేస్తున్నావా.. సస్పెండ్ చేయిస్తాను, అనే పదాలు వాడి, వేళ్లు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు గోలగాని శ్రీనివాసరావు. ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ని మేయర్ భర్త, కొందరు కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు చుట్టుముట్టి.. దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ సమయలో పక్కనే 12వ డివిజన్ కార్పొరేటర్ అక్రమాని రోహిణి ఉన్నారు. విధి నిర్వహణలో, అందులోనూ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై స్వయంగా మేయర్ భర్త ఈ విధంగా ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.