తిరుమలకు వీఐపీల తాకిడి - శ్రీవారిని దర్శించుకున్న జమ్ము కాశ్మీర్ గవర్నర్ - tirupati local news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 5:59 PM IST
VIPs for Tirumala Srivari Darshan : నూతన సంవత్సరం పర్వదినం పురస్కరించుకొని తిరుమలకు వీఐపీ తాకిడి పెరిగింది. కలియుగ వైకుంఠ వాసుని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేస్తుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశ్వీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
People Visit Srivari on New Year's Day : సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు శ్రీవారి దర్శనం చేసుకోవడం వల్ల ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం అయ్యి భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళసై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీజేపీ నేత కిషన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, సినీ నటుడు సుమన్ కలియుగ వాసుడిని దర్శించుకున్నారు.