అర్ధరాత్రి ఇసుక అక్రమ తరలింపు - లారీలను అడ్డుకున్న గ్రామస్థులు - అధికార బలంతో అక్రమంగా ఇసుక తరలింపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 10:46 AM IST
Villagers Stopped Sand Lorries in Guntur District: రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామ సమీపంలో ఇసుకను అక్రమంగా తరలించేందుకు వచ్చిన లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుక లోడుతో ఉన్న సుమారు 20 లారీలను బోరిపాలెంకి రాగానే తెలుగుదేశం పార్టీ నేతలు, గ్రామస్థులు కలిసి రోడ్డుపై అడ్డుకున్నారు. గత కొంతకాలంగా బోరుపాలెంలో రాత్రి సమయంలో వేల టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ వ్యవహారాలు కొనసాగుతున్నాయని ప్రతిపక్ష నేతలు వెల్లడించారు.
ఆదివారం తెల్లవారుజామున ఇసుకను తరలించేందుకు 20 లారీలతో వచ్చిన అధికార పార్టీ నేతలను బోరుపాలెంకు రాగానే గ్రామస్థులు వారిని అడ్డుకుని లారీలను అక్కడే నిలిపివేశారు. కానీ ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి అధికార బలంతో తన అనుచరులతో వచ్చి లారీలను బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారని గ్రామస్థులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు అధికారులను కోరుతున్నారు.