Villagers Paraded Teacher on Their Shoulders: గురువుపై గ్రామస్థులు అభిమానం.. భావోద్వేగానికి గురైన ఉపాధ్యాయుడు - Villagers Paraded Teacher on Their Shoulders
🎬 Watch Now: Feature Video
Villagers Paraded Teacher on Shoulders: తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే అని పెద్దలు అంటుంటారు. అందుకు నిదర్శనంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి.. వారికి భావోద్వేగంగా వీడ్కోలు పలకడం తరచూ చూస్తుంటాం. కానీ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆనపకాయ గూడ గ్రామస్థులు మాత్రం బదిలీపై వేరే చోటికి వెళ్లే ఓ ఉపాధ్యాయునిపై తమకు ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. అంపిలి రామారావు అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యార్ధులతో పాటు గ్రామస్థులతో కూడా అతనికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇటీవల అతనికి సీతంపేట మండల పాఠశాలకు బదిలీ అయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్నారు. ముందుగా గ్రామస్థులు ఉపాధ్యాయుడికి హారతులు ఇచ్చి.. పూలదండలు వేసి మేళతాళాలతో అతన్ని గ్రామమంతా వారి భుజాలపై ఊరేగించారు. గ్రామస్థులు తనపై చూపిన ప్రేమ, అభిమానానికి ఆ ఉపాధ్యాయుడు కన్నీటి పర్యంతమయ్యాడు.