Vijayawada East MLA Gadde Ram Mohan Rao: 'అబద్దాన్ని గట్టిగా చెప్పడంలో వైసీపీ నేతలు సమర్ధులు.. టీడీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి' - విజయవాడ అభివృద్ధి
🎬 Watch Now: Feature Video
Vijayawada East MLA Gadde Ram Mohan Rao: విజయవాడ అభివృద్ధిపై సజ్జలకు ఏం తెలుసని నోరుపారేసుకుంటున్నాడని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ప్రశ్నించారు. నగరాభివృద్ధి ఎవరు చేశారో ప్రజల్ని అడిగితే.. తెలుగుదేశమే(Telugu Desam Govt)నని ముక్తకంఠంతో చెప్తారన్నారు. కృష్ణానది రిటైనింగ్ వాల్‌కు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని వైసీపీ గుర్తించాలని హితవు పలికారు. మూడు దశల్లో 5 కిలో మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పారు. వైసీపీ నాయకులు అబద్దాన్ని కూడా బలంగా చెప్పగల సమర్ధులన్న ఆయన.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా రిటెయినింగ్ వాల్ గురించి అసత్యాలు మాట్లాడారని తెలిపారు. చంద్రబాబు గాలికొదిలేశారని, ఏ మాత్రం శ్రద్ధ వహించలేదని.. మేం ఆ వాల్ కడుతున్నామని జగన్(CM Jagan) చెప్పారని వెల్లడించారు. ఇదే విషయాన్ని మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రామ్మోహన్ రావు తెలిపారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రభుత్వంలో రూ.150కోట్లు ప్రకటించినా.. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు.