Foreigners Flock to Onakadilli in Andhra-Odisha Border: అదొక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ చెప్పుకోదగ్గ కట్టడాలు, ప్రదేశాలు ఏమీ లేవు. కానీ అక్కడకు రావడానికి విదేశీయులు క్యూ కడుతుంటారు. అందుకు కారణం అక్కడ జరిగే వారపు సంత. అందులోనూ ఆ వారపు సంత కోసం వచ్చే గిరిజన మహిళలను చూడ్డానికి, వారి సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికే. ఈ గ్రామం మరెక్కడో కాదు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉండే ఒనకడిల్లి.
శీతాకాలం వచ్చింది అంటే ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల ఒనకడిల్లిలో వారపు సంత జరుగుతుంది. ఈ వారపు సంతకు ప్రపంచ నలుమూలల నుంచి భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ వారపు సంతకు నేటి ఆధునిక యుగంలో కూడా తమ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు తూచ తప్పకుండా పాటించే బొండ ఆదిమజాతి తెగకు చెందిన మహిళలు వస్తుంటారు. సాధారణంగా వారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అయితే వీరు తమకు కావలసిన నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి కోసం ఈ వారపు సంతకు వస్తుంటారు.
ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది - విశాఖలో మత్స్యకారుల పూజలు
వీరి సంస్కృతి సంప్రదాయాలు చూడటానికి శీతాకాలంలో ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ పర్యాటకుల వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం జరిగిన ఈ వారపు సంతకు దాదాపు 150 మంది వరకు విదేశీ పర్యాటకులు వచ్చారు. ఆస్ట్రేలియా ఇటలీ, అమెరికా, జర్మనీ, హాలండ్ తదితర దేశాల నుంచి విదేశీయులు ఈ సంతను సందర్శించారు. ఆదివాసీ మహిళలు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను సైతం రుచి చూశారు. నేటికీ ప్రకృతికి దగ్గరగా ఉన్న వీరి సంస్కతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని పర్యాటకులు అన్నారు.
అక్కడ ఉండే గిరిజన మహిళల ఆచారాలను, సంప్రదాయాలను గురించి అధ్యయనం చేయడానికి ఎక్కువగా ఇక్కడకు వస్తున్నట్లు విదేశీయులు తెలిపారు. ఆ గిరిజనులు ఆహారపు అలవాట్లు, వస్త్ర ధారణ, అభిరుచులు వంటి వాటి గురించి తెలుసుకుంటున్నామని చెప్తున్నారు. అక్కడ ప్రదేశం చాలా బాగుందని ప్రజల ఆచార, వ్యవహారాలు కూడా చాలా బాగున్నాయని వీటి గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని విదేశీయులు చెప్తున్నారు.
మామిడి పండ్లు, తాటి ముంజలు ముందే వచ్చేశాయి - ఎక్కడ దొరుకుతున్నాయంటే?