రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన శ్వేతపత్రం విడుదల చేయగలరా?: విజయ్‌కుమార్ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 7:02 PM IST
Vijayakumar on Fires on YCP Govt About State Financial Situation: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన శ్వేతపత్రం ఇవ్వగలరా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ నిలదీశారు. గత నాలుగున్నరేళ్లలో రిజర్వ్ బ్యాంక్ ద్వారా, కార్పోరేషన్ల ద్వారా, లిక్కర్ బాండ్ల ద్వారా బ్యాంకుల నుంచి ఎంతెంత అప్పులు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సంక్షేమంపై బుగ్గన అంకెల గారడీతో చెప్పేవన్నీ బడాయి కబుర్లేనని విమర్శించారు. 9.39 లక్షల బడ్జెట్లో ఇప్పటి వరకు సంక్షేమం మీద ఖర్చు పెట్టింది కేవలం 1.53 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు.
మద్యంపై వచ్చిన రాబడితో ప్రభుత్వ ఆదాయం పెంచుకున్నారు.. ఈ నాలుగున్నరేళ్లలో మద్యంపై రూ.65 వేల కోట్లు రాబట్టారని విమర్శించారు. రూ.లక్షా 14 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండం అంటున్నారు.. కానీ రాష్ట్ర అప్పులు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ప్రభుత్వం అప్పులు విషయంలో ఎన్ని అబద్దాలు చెప్పినా.. కాగ్ నివేదికలు మాత్రం అధికంగా అప్పులు చేశారని చెప్తున్నాయని విజయకుమార్ అన్నారు.